శుభవార్త



1. దేవుడు

సృష్టికర్త, పరిశుద్ధుడు, ప్రేమామయుడు మరియు న్యాయవంతుడునైన ఏకైక దేవుడు మనలను తన స్వరూపమందు, తన పోలిక చొప్పున తన మహిమ కొరకు చేసియున్నాడు. ప్రకటన 4:11

2. మానవుడు

కాని మనం పాపముచేసి ఆయనతో తెగతెంపులు చేసికొని, సహవాసాన్ని కోల్పోయి ఆయన ఉగ్రతకు గురియై మరణమునకు దేవుని శిక్షకు పాత్రులమైయున్నాము, రోమా 3:10-12; హెబ్రీ 9:27

3. యేసు క్రీస్తు

అయినప్పటికీ దేవుడు తన గొప్ప ప్రేమను బట్టి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడుగా, పరిపూర్ణ నీతిమంతునిగా జీవించి, మనకు బదులు సిలువలో మరణించి మన పాప శిక్షను వహించి, సమాధిచేయబడి, మూడవరోజున తిరిగిలేచాడు. తన పై విశ్వాసముంచి, తన వైపు తిరిగే వారందరి పాప శిక్షను తానే భరించడం ద్వారా ధర్మ శాస్త్రాన్ని తానే నెరవేర్చాడు. మృతులలో నుండి లేవడం ద్వారా దేవుడు క్రీస్తు యొక్క అర్పణ స్వీకరించాడనీ, తద్వారా దేవుని ఉగ్రత తీరినదనీ చూపించాడు. మనలను పాపమునుండి విమోచించి తిరిగి దేవునితో సమాధానపరిచాడు. 1 పేతురు 3:18; 1 పేతురు 1:3-4

4. గొప్ప ఆహ్వానం

ఇప్పుడు మన పాపముల విషయమై పశ్చాత్తాపపడాలనీ, క్షమాపణ కొరకు క్రీస్తునే నమ్మాలనీ ఆయన మనలను పిలుస్తున్నాడు. యోహాను 3:36

5. మన స్పందన

మనము మారుమనస్సు పొంది పశ్చాత్తాపముతో క్రీస్తుని మాత్రమే విశ్వసించి, యేసే ప్రభువని నోటితో ఒప్పుకొనుట ద్వారా, తగిన ఫలములు ఫలియించుటకు, దేవునితో నిత్య జీవము లోనికి కృపతో ఆహ్వానిస్తున్నాడు ఇదే 'శుభవార్త' ! యోహాను 3:16; యోహాను 1:12; 1 యోహాను 1:9