మా సంఘ ఆరాధన క్రమము వాక్యము మీద ఆధారపడి ఉంటుంది. సంఘ ఆరాధనలో మేము చేసే ప్రతి భాగము దేవుడు తన వాక్యములో, సంఘముగా కుడుకున్నప్పుడు ఏమి చేయాలో అని తన వాక్యంలో స్పష్టముగా ఆజ్ఞాపించిన ఆ వాక్య సత్యాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యముగా మన ఆరాధన అనేది దేవుణ్ణి సేవించడం కొరకు కాబట్టి మనం మన ఇష్ట ప్రకారము కాకుండా మరియు మనకు ఏది ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుంది అనే అంశాలను ప్రామాణికం చేసుకొనక దేవుడు తన వాక్యములో మనము ఆయనను ఏ విధంగా ఆరాధించాలి అని వ్రాయించిన ఆజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా ఆయనను మహిమ పరుస్తాము, ఆయనయందు సంతోషించగలుగుతాము మరియు మనము క్రీస్తులోనికి మారడానికి మన జీవితంలో పనిచేస్తుంది. (ఆదికాండము 4:4-5; లేవీకాండము 10:1-3; 2 సమూయేలు 6:7; మార్కు 7:7).
సంఘ ఆరాధనలో ఏ విషయాలు ఉండాలో దేవుడు తన వాక్యములో మనకు ఆజ్ఞాపించాడు. వాక్యమును ప్రార్థించడం, వాక్యమును పాడడం, వాక్యమును చదవడం, వాక్యమును బోధించడం, బాప్తిస్మము మరియు ప్రభుబల్ల సంస్కరణల ద్వారా వాక్యమును చూడడం.
ప్రభు దినము
ప్రభువు దినము రోజు ఆరాధనకు కూడుకొవడము అనేది సంఘము పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. క్రైస్తవుని జీవితంలో ప్రతి వారము ప్రభువుదినము రోజు కుడుకోవడం అనేది ప్రాముఖ్యమైన ధ్యేయంగా ఉండాలి.
వాక్యంలో, వారంలో మొదటి రోజు అయినా ఆదివారమున ప్రభువు దినముగా పిలుస్తారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తువారి పునరుత్థానము గురించి జ్ఞాపకం చేయుచున్నది. ప్రభుదినము రోజు ఆరాధనకి కూడుకొవడము అనేది లేఖనాలలో మనకు ఇవ్వబడిన మాదిరి. (ప్రకటన 1:10; మత్తయి 28:1; లూకా 24:1; యోహాను 20:1; అపోస్తుల కార్యములు 20:7; 1కొరింతి 16:2) మరియు 2000 సంవత్సరాల సంఘ చరిత్ర చెబుతుంది ఈ ప్రభువు దినము గురించి.
ఆరాధన క్రమములో చేసే ప్రతి విభాగము యొక్క వివరణ
1. ఆహ్వానము మరియు ప్రకటనలు
సంఘమునకు వందనములు తెలియజేస్తూ, మన సంఘములో జరిగే కార్యక్రమాలు విశేషాలను గురించి సంఘమునకు తెలియజేయడం.
2. ఆరాధనకు పిలుపు మరియు ప్రారంభ ప్రార్థన
దేవుని యొక్క సమేవేశాన్ని దేవునియొక్క మాటతో ప్రారంభించడం మరియు ముగించడం. దేవుని వాక్యము ద్వారా క్రీస్తునందు మనకున్న ఆనందముతో ఆరాధనకు పిలుపునివ్వడం వాక్యము చదివిన తర్వాత చదవబడిన వాక్యపు వెలుగులో ప్రార్థించడం, ఆ ఆరాధన కూడిక ద్వారా దేవుడు మన హృదయములో కార్యము జరిగించడానికి ఆయన సహాయమును వేడుకోవడం.
3. సంఘమందరు ఏకీభవించి పాడడం
"ఎఫెసీ 05 : 19 - 20 ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు," మేము వాక్య ఆధారిత పాటలు, అందరు కలిసి ఏకీభవించి పాడే పాటలను మాత్రమే పాడుతాము. తమ స్వరములెత్తి మోమాటపడకుండా పాడమని మేము ప్రోత్సహిస్తాము నీ చుట్టు ప్రక్కలవున్న క్రీస్తునందు సహోదరి సహోదరులను చూస్తూ వారందరితో ఏకీభవించి పాడమని ప్రోత్సహిస్తాము.
4. వాక్య పఠనం
"నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము." 1తిమోతికి 4:13. వాక్యము మన సంఘ సభ్యులచే చదవబడుతుంది మరియు సాధారణంగా వాక్య పఠనం ఆ రోజు బోధించబడే వాక్య భాగానికి అనుగుణంగా చదవబడుతుంది మరియు అదే విధముగా ఆరాధన మరియు ఒప్పుకోలు ఉంటుంది.
5. ప్రార్థన
ఈ ప్రార్థన స్వీయ-పరీక్ష మరియు వ్యక్తి గత ఒప్పుకోలులోనికి నడిపిస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండడం జరుగుతుంది. ఆత్మీయ నాయకుడు దేవుణ్ణి స్తుతిస్తాడు మరియు మహిమపరుస్తాడు మరియు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన మనలను అంగీకరించే వైపుకు నడిపిస్తాడు. ఈ ప్రార్థన మనము సంఘముగా కలిసి చేస్తాము.
6. స్తుతి మరియు క్షమాపణ ప్రార్థన
క్షమాపణ ఒప్పుకోలు ప్రార్థనను అనుసరించి, దేవుడు వారి అపరాధాలను క్షమించి, వారి పాపాన్ని తీసివేస్తాడు మరియు దేవుడు వారిని ఎప్పటికి తన బిడ్డలుగా యేసుక్రీస్తు ద్వారా అంగీకరిస్తాడు అని దేవునివాక్యములో ఉంది.
7. విజ్ఞాన ప్రార్థన
విజ్ఞాన ప్రార్థన వెలిగింపు తరచుగా "కాపరి ప్రార్థన" అని పిలుస్తారు, దీనిని మన పెద్దలలో ఒకరు ప్రార్థిస్తారు. ఈ ప్రార్థనలో, మన జీవితాలలో, మన చర్చిలో మరియు ప్రపంచంలోని దేవుని రాజ్యం యొక్క పురోగతి కోసం సేవకుడు సమాజం తరపున దేవుడిని వేడుకుంటాడు.
8. ప్రసంగం
వాక్య ప్రసంగం అంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడినప్పుడు. మనకు క్రీస్తును చూపించడానికి దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడని మేము వాక్యభాగంలోని ముఖ్య అంశాన్ని ప్రసంగంలో ముఖ్య అంశంగా బోధించడానికి ప్రయత్నిస్తాము. దీనినే ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ అంటారు. బోధకుడు వినోదాన్ని ఇవ్వడం లేదా “జీవిత పాఠాలు” ఇవ్వడం లేదా తన స్వంత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకోడు, కానీ లేఖన సందేశానికి నమ్మకంగా ఉండటమే కాకుండా దాని అర్థాన్ని వివరిస్తూ మరియు దానిని మన జీవితాలకు వర్తింపజేయడం. ఇది ఎక్స్‌పోజిటరీ ప్రసంగం.
9. ఇవ్వడం
దేవుడు మనకు ఇచ్చిన సమస్తమునకు కృతజ్ఞతగా, ఆరాధనగా మన ధనమును ఆయనకు ఇవ్వడం. స్థానిక సంఘమునకు క్రమంగా, ఉదారంగా, త్యాగపూర్వకంగా, ఉత్సాహంగా మన ధనమును ఇవ్వాలని బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది, మనం ఇస్తేనే ఆరోగ్యం, ఐశ్వరం పొందుకుంటాము అనే వాగ్దానము దేవుడు చేయనప్పటికి, ఇవ్వడం ద్వారా మనము ఆయనను మహిమపరుస్తున్నాము, ఆయన సంఘము యొక్క అవసరతలకు మరియు ఆయన రాజ్య విస్తరణలో మన ధనమును వినియోగించడం ద్వారా ఆయనను సంతోషపరుస్తున్నాము. (2కొరింథీ.9, 1తిమోతి5:17-18, గలతి.6:6)
10. ప్రభువు బల్ల "సహవాస భోజనం"
ప్రభువు బల్ల అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడిన క్రొత్త నిబంధన "భోజనం" ఇది క్రీస్తునందు విశ్వాసముంచి బాప్తీస్మం తీసుకున్న విశ్వాసులు అందరూ కలిసి ప్రభువు యొక్క త్యాగపురిత మరణాన్ని జ్ఞాపకం చేసుకొంటూ క్రీస్తు శరీరములో మన ఐక్యతను తెలియపరుస్తూ ఆయన మరణాన్ని ఆయన వచ్చువరకు ప్రకటించడం. అలాగే ఈ బల్లను ఆచరించే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలని వాక్యము తెలియజేస్తుంది.
11. ముగింపు
దేవుడు తన కార్యక్రమములో లేదా సభలో మొదటి పదముగా ఉన్నప్పుడు ఆయనే చివరగా కూడా ఉండాలి. "బెనడిక్షన్ "అనే ఇంగ్లీషు పదానికి అర్ధం " ఆశీర్వాదం ". ప్రకటించిన ప్రసంగం అనంతరం అన్వయింపు తరువాత కొద్ది పాటి నిశ్శబ్ద వాతావరణంలో వాక్యము నుండి పాస్టర్ గారు / ప్రసంగీకుడు ప్రజలపై చేసేదే ఆశీర్వాదపు వచనం. దీని ద్వారా తన ప్రియమైన ప్రజలపై ప్రభువు యొక్క ఆశీర్వాద వచనముతో సభ లేదా కార్యక్రమము ముగించబడుతుంది.