Statement of Faith



బైబిల్

మేము లేఖనాలను, అనగా పాతనిబంధన మరియు క్రొత్తనిబంధన గ్రంధములు దేవునిచేత ప్రేరేపించబడినవి, మూల రచనల్లో ఎలాంటి లోపాలు లేవని, మానవుని రక్షణ కొరకైన సంపూర్ణ ప్రత్యక్షత మరియు క్రైస్తవ విశ్వాసము, జీవితము మరియు నడవడిక విషయంలో అంతిమ అధికారము కలిగినవని విశ్వసిస్తాము. (కీర్తనలు 19:7; మార్కు 12:36; లూకా 24:44; రోమా 15:4; 2 తిమోతి 3:16-17; 2 పేతురు 1:21).

త్రిత్వము

మేము దేవుడు ఒక్కడే అని నమ్ముతాము, ఆయన సమస్తమును సృజించినవాడు, అనంతమైన, పరిపూర్ణమైన మరియు శాశ్వతమైన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు (మత్తయి 28:18-19; 3:16-17; 2 కొరింథీ 13:14).

యేసు క్రీస్తు

మేము యేసు క్రీస్తు యొక్క పూర్తి దైవత్వాన్ని విశ్వసిస్తాము; ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన కన్యకకు జన్మించాడు, దేవుడు ఖచ్చితంగా శరీరములో ప్రత్యక్షమయ్యాడు; సిలువపై మరణించాడు, పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన బలిగా మన స్థానంలో మరియు మన పాపాల కొరకు లేఖనాల ప్రకారం చనిపోయి, శరీరముతో తిరిగి లేచాడు మరియు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అక్కడ సర్వోన్నతుని కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. అయన మన ప్రధాన యాజకుడు మరియు ఉత్తరవాది అని మేము నమ్ముతాము. (యోహాను 1:1-3, 14, 18; 1 యోహాను 4:2, 14-15; యెషయా 7:14; మత్తయి 1:18-23; హెబ్రీ 4:14-16; 1 కొరింథీ 15:3-7; యోహాను 14:1-3; అపొస్తలుల కార్యములు 1:11; ఫిలిప్పి 2:10-11).

పరిశుద్ధాత్ముడు

మేము పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని మరియు దైవత్వాన్ని విశ్వసిస్తాము మరియు ఆయన పరిచర్య ప్రభువైన యేసు క్రీస్తును మహిమపరచుటయు, ప్రస్తుత కాలంలో కృపచేత పాపమును ఒప్పింపచేసి, పాపిని నూతనపరచి, విశ్వాసముద్వారా క్రీస్తు శిరస్సుగా ఉన్న ఒక్క శరీరంలోని (సంఘము)కి చేర్చి; అతనిలో ఉండి, నడిపిస్తూ, బోధిస్తూ, దైవిక జీవనం మరియు పరిచర్య చేయుటకు శక్తిమంతులనుగా చేస్తాడు అని మేము నమ్ముతాము. (యోహాను 14:16-17; 16:13-14; అపొస్తలుల కార్యములు 2:38, రోమా 8:9; 1 కొరింథీ 6:19; 12:13, ఎఫెసీ 4:30; 5:18).

రక్షణ

మానవుడు నేరుగా దేవుని చేత, ఆయన పోలికలో సృష్టించబడ్డాడు అని నమ్ముతాము, మానవులందరూ దేవుని ఎదుట స్వభావికముగా, మరియు క్రియల ద్వారా పాపులు మరియు దేవుని యెదుట శిక్షార్హులుగా నిలబడుచున్నారు. సర్వ మానవాళి అంతయు అదే స్థితిలో ఉన్నారు. పాపి కేవలం కృపద్వారా మరియు పరిశుద్ధాత్మ తిరిగి జన్మింపచేయుట ద్వారా పశ్చాత్తాపంలోనికి నడిపించబడి, క్రీస్తు యేసు నందు విశ్వాసముంచడం ద్వారా రక్షించబడి నిత్యజీవము పొందుతాడు అని మేము నమ్ముతాము. (యోహాను 1:1-14; 3:1-21, 36; 10:27-30; రోమా 1:18-25; 3:21-26; 5:6-8; ఎఫెసీ 2:1-9; 1 పేతురు 1:18-19).

మానవుడు

దేవుని సృష్టిలో మానవుడు ప్రత్యేకమైనవాడు అని నమ్ముతాము. మానవుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. దేవుడు వారిని పురుషునిగా స్త్రీనిగా సృష్టి అంతటికి కిరీటముగా సృష్టించాడు. లింగ బహుమతి దేవుని సృష్టి యొక్క మంచితనంలో భాగం. మానవ వ్యక్తిత్వపు పవిత్రత, మానవుడు దేవుని పోలికలో సృజించబడ్డాడు అనుటకు ఋజువు. క్రీస్తు మానవుని కొరకు మరణించాడు గనుక ప్రతి జాతికి చెందిన ప్రతి వ్యక్తి పూర్తి గౌరవము కలిగి ఉండుటకు మరియు క్రైస్తవ ప్రేమకు అర్హుడు అని మేము నమ్ముతాము. (ఆది 1:26-30; 2:5,7,18-22; 3; 9:6; కీర్తనలు 8:3-6; 32:1-5; 51:5; యిర్మీయా 17:5; మత్తయి 16:26; అపొస్తలుల కార్యములు 17:26-31; రోమా 1:19-32; 3:10-18,23; కొలొస్సి 1:21-22; 3:9-11).

యేసు క్రీస్తు రెండవ రాకడ

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమరణం మరియు పునరుత్థానము మాత్రమే పాపులను నీతిమంతులుగా తీర్చుటకు మరియు వారి రక్షణకు పునాదిగా ఉన్నదని మేము నమ్ముతున్నాము (1 యోహాను 1:8-10; 2:28; 3:2-3; మత్తయి 24:42-44; హెబ్రీ 10:24-25; ప్రకటన 1:7; 22:20; 22:42).

పునరుత్థానము

మన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షణ ఉద్దేశ్యాన్ని పూర్తి చేయడానికి మరియు బైబిల్ వాగ్దానాలను నెరవేర్చడానికి వ్యక్తిగత, కనిపించే, శారీరక మరియు ఆసన్నమైన పునరాగమనాన్ని మేము విశ్వసిస్తాము. మరియు ఈ ఆశీర్వాద నిరీక్షణ విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితం మరియు పరిచర్యపై కీలకమైన ప్రభావాన్ని కలిగి ఉంది. మానవ బలహీనత నుండి సంపూర్ణ విమోచన క్రీస్తు యొక్క అద్భుతమైన పునరాగమనం కోసం ఎదిరి చూస్తుంది. ప్రస్తుత కాలంలో మానవాళి అనారోగ్యం, లేదా వ్యాధి, లేదా పేదరికం, అన్యాయపు తీర్పు మొదలగు ఇబ్బందులనుండి సంపూర్ణంగా విడిపించబడతాడు అనడానికి ఖచ్చితమైన బైబిల్ ఆధారాలు ఏవి లేవు. చనిపోయిన వారందరి శారీరక పునరుత్థానాన్ని, విశ్వాసి యొక్క శాశ్వతమైన ఆశీర్వాదమును మరియు ప్రభువుతో ఆనందమును, మరియు అవిశ్వాసులకు తీర్పు మరియు శాశ్వతమైన మరియు స్పృహతో కూడిన శిక్ష ఉంటుందని మేము నమ్ముతాము (యోహాను 5:25-29; 1 థెస్సలోనిక 4:13-18; ప్రకటన 20:11-15).

సంఘము

నిత్యజీవము కొరకు కృపచేత, క్రీస్తుయేసునందున్న విశ్వాసము వలన వరముగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగిజన్మించిన వారి సమకూర్పే సంఘము. వారు క్రీస్తు శరీరంలో కలసి జీవిస్తారు. సంఘమునకు క్రీస్తే శిరస్సు. స్థానిక సంఘము అనేది సువార్త మూలంగా, విశ్వాసం మరియు సహవాస ఒడంబడికతో అనుబంధించబడిన విశ్వాసుల సమాజము అని మేము నమ్ముతున్నాము. క్రీస్తు ఆదేశాలను పాటిస్తూ ఆయన నియమాలచేత పరిపాలించబడటం మరియు తన వాక్యపు వెలుగులో వరములను, అధికారమును, ఆధిక్యతలను ఉపయోగిస్తూ, తమ చుట్టూ ఉన్న వారికి మరియు క్రైస్తులో విశ్వాసముంచిన వారికి వారి మధ్యలో సాక్షులుగా ఉంటూ, వాక్యంలో వారిని స్థిరపరుస్తూ, వారు ఇతరులను చేరునట్లుగా శిష్యులను చేయడాన్ని మేము విశ్వసిస్తాము. (ఎఫెసీ 1:22-23; కొలొస్సి 1:18; 1 కొరింథీ 12:13; 14:23; హెబ్రీ 10:25; మత్తయి 28:16-20; అపొస్తలుల కార్యములు 2:42).

సంఘ విధులు

బాప్తీస్మము మరియు ప్రభురాత్రి భోజనం ఈ ప్రస్తుత కాలంలో సంఘముచేత పాటించవలసిన నియమిత విధులు అని మేము నమ్ముతున్నాము. అవి విశ్వసించిన వారికి కృపా సాధనాల చిహ్నాలే కానీ అవి రక్షణకు సాధనాలు కావు అని మేము నమ్ముతాము. (మత్తయి 28:18; లూకా 22:19-20; అపొస్తలుల కార్యములు 10:47-48; 16:32-33; 18:7-8; 1 కొరింథీ 11:23-32).

క్రైస్తవ జీవితం

విశ్వాసులందరూ తమ రక్షకుని మరియు ప్రభువును గౌరవించే మరియు మహిమపరిచేలా మరియు నిందను తీసుకురాకుండా జీవించాలని మరియు తప్పుడు సిద్ధాంతాలు, పాపభరితమైన ఆనందాలు, అభ్యాసాలు, సహవాసాల నుండి వేరుగా ఉండాలని దేవుడు ఆదేశించాడని మేము నమ్ముతున్నాము (1 కొరింథీ 10:31; 2 కొరింథీ 5:17; యోహాను 14:21).